Share News

KTR : జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ABN , Publish Date - Sep 07 , 2025 | 10:29 AM

కేటీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దీనిపై వారం రోజులుగా కేసీఆర్‌తో మంతనాలు జరిపినట్టు సమాచారం. పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేయడంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప..

KTR : జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR District Tours

హైదరాబాద్, సెప్టెంబర్ 7 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి వారం రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌తో.. కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్‌కు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. కవితను సస్పెండ్ చేయటంతో పార్టీ క్యాడర్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమచారం.


మరోవైపు, పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ముఖ్యంగా టార్గెట్ చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. వీటితోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ‌నెల 10న కొత్తగూడెం, 11న భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ టూర్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 13న‌ గద్వాల్ నియోజకవర్గంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని కేటీఆర్ భావిస్తున్నారు. దసరా లోపు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు

వైసీపీకి షాకిచ్చిన కౌన్సిలర్లు.. ఏం జరిగిందంటే..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 07 , 2025 | 10:44 AM