Home » KTR
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీనా? అంటూ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైరయ్యారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎవరడిగారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కాంగ్రెస్ థార్థ్ క్లాస్ పార్టీ అన్న వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉండి... ఇప్పుడు అధికారం పోయేసరికి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముందు కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించి తర్వాత కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందని మంత్రి కొండా సురేఖ హితవు పలికారు.
తెలంగాణ బిడ్డ అయిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్నారని.. ఆయనకు బీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. కేసీఆర్ తన పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేసినట్లే తెలంగాణ వ్యక్తులకు కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వదిలేశారా అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం అంటే ఏంటో కేటీఆర్ చెప్పాలన్నారు.
జేపీ నేతల మూర్ఖపు మాటలతో బీజేపీ బలపడదని తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. నెలాఖరులోపు తెలంగాణకు కేటాయించాల్సిన యూరియా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం చేతకానితనంతోనే తెలంగాణకు యూరియా కష్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత నెల 25న తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను అనుమతించిన సుప్రీం ధర్మాసనం.. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది.
ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతు కోరుతూ ఏ కూటమి కూడా తమను సంప్రదించలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తమది స్వతంత్ర పార్టీ అని.. ఢిల్లీలో బాస్‌లు ఎవరూ లేరని స్పష్టం చేశారు.
చెల్లెలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె అన్న, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో కవితకు పూర్తిగా చెక్..
KTR Fires On CM Revanth: సెప్టెంబర్ 9లోపు తెలంగాణకు ఎవరు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తే వారికే తమ మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.