Sama Ram Mohan Reddy On KTR: కేటీఆర్‌పై కుట్ర జరుగుతోంది.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:41 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కుట్ర జరుగుతోందంటూ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కుట్ర జరుగుతోందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత రాజకీయాలు తీవ్రంగా ముదిరాయని అన్నారు.
సీనియర్ నేత కుట్ర
కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు అందుకోవాలనే ఆశతో ఉన్న ఒక సీనియర్ నేత, కేటీఆర్‌ను రాజకీయంగా పక్కకు నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కుట్రకు కేంద్రంలో బీజేపీ నాయకులు మద్దతుగా ఉన్నారని సామ రామ్మోహన్ రెడ్డి సెన్షేషనల్ కామెంట్స్ చేశారు.
అంతేకాకుండా, బెంగళూరులోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) కార్యాలయంలో కేటీఆర్‌ను ఇరికించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఓ ప్రముఖ సినీ నటి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కేటీఆర్ పేరు ప్రస్తావించారని, దాన్నే ఆధారంగా చేసుకొని ఇప్పుడు కుట్ర పన్నే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణ చేసి వాస్తవాలు తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:
మధు యాష్కీ గౌడ్‌కు అస్వస్థత.. సెక్రటేరియట్‌లో షాకింగ్..
విరుచుకుపడనున్న మరో షాపింగ్ స్కామ్.. తస్మాత్ జాగ్రత జాగ్రత
For More Latest News