Madhu Yashki Goud: మధు యాష్కీ గౌడ్‌కు అస్వస్థత.. సెక్రటేరియట్‌లో షాకింగ్..
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:40 PM
మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లోని శ్రీధర్ బాబు ఛాంబర్‌లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు.
హైదరాబాద్: మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్‌లో మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి వెళ్లిన ఆయన ఉన్నట్టుండి ఛాంబర్‌లో కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మంత్రి శ్రీధర్ బాబు సిబ్బందిని అలర్ట్ చేశారు. హుటాహుటినా మధు యాష్కీనీ చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.