COD Parcel Scam: విరుచుకుపడనున్న మరో షాపింగ్ స్కామ్.. తస్మాత్ జాగ్రత జాగ్రత
ABN , Publish Date - Sep 16 , 2025 | 04:53 PM
కొత్తగా వెలుగుచూస్తున్న 'క్యాష్ ఆన్ డెలివరీ' కుంభకోణం ప్రభావం భారతదేశంలోని హౌస్‌హోల్డ్స్‌పై ఉండనుందని త్విషా తులి హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన ఒక రీల్‌లో స్కామర్లు ఏవిధంగా నకిలీ పార్సిల్స్ డెలివరీ చేసి సొమ్ము వసూలు చేస్తారో వివరించింది.
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ద్వారా వస్తువులు, సేవలను కొనుగోలు చేయడం అమ్మడం (e-commerce) ఇటీవల కాలంలో, ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత బాగా పెరిగింది. ఇదే సమయంలో ఆన్‌లైన్ స్కామ్‌లు కూడా వెలుగుచూస్తున్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలకు క్యాష్-ఆన్-డెలివరీ (COD) అనేది వినియోగదారులకు పాపులర్ ఆప్షన్‌గా ఉంది. తాజాగా డిజిటల్ క్రియేటర్ త్విషా తులి (Tvisha Tuli) ఒక 'COD' స్కామ్‌ను హైలైట్ చేస్తూ.. ఇలాంటివి పరిపాటిగా మారే అవకాశం ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో హెచ్చరించింది.
క్యాష్ ఆన్ డెలివరీ స్కామ్ ఇలా..
కొత్తగా వెలుగుచూస్తున్న 'క్యాష్ ఆన్ డెలివరీ' కుంభకోణం ప్రభావం భారతదేశంలోని హౌస్‌హోల్డ్స్‌పై ఉండనుందని త్విషా తులి హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన ఒక రీల్‌లో స్కామర్లు ఏవిధంగా నకిలీ పార్సిల్స్ డెలివరీ చేసి సొమ్ములు వసూలు చేస్తారో వివరించింది. ఇందుకోసం విశ్వసనీయ కొరియర్ నెట్‌వర్క్‌లు డెలివరీ, బ్లూ డార్ట్, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, షోడోఫాక్స్ వంటి వాటిని ఉపయోగించుకుంటారని తెలిపింది.
తనకు ఎదురైన అనుభవాన్ని కూడా తులి ఈ వీడియోలో పంచుకుంది. ఇటీవల తన కుటుంబంలోని ఒకరి పేరుతో ఇంటికి ఫేస్‌మాస్క్‌ల పార్సిల్ వచ్చిందని, అయితే పార్సెల్ ఆర్డర్ ఇవ్వనందున దానిని తిప్పిపంపించడం జరిగిందని తెలిపింది. కొద్దిరోజుల తర్వాత ఇదే తరహా ప్యాకేజీ తన ఇంట్లో మరో వ్యక్తి పేరున వచ్చిందని, అయితే ఇంట్లో ఎవరో ఆర్టర్ ఇచ్చి ఉంటారని భావించి రూ.7,000 చెల్లించి పార్సిల్ తీసుకోవడం జరిగిందన్నారు. ప్యాకేజీ తెరిచి చూస్తే బయట ఏమి రాసుందో అది లోపల లేదని, చైనా పుస్తకం ఒకటుందని, సదరు ప్రాడెక్ట్‌పైనున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండానే సొమ్ము పోగొట్టుకున్నామని ఆమె తెలిపారు.
ఇలాంటి స్కామ్‌లకు పాల్పడేవారు సీఓడీని తరచు ఎవరు ఉపయోగిస్తున్నారు, అక్కడ ఎవరు నివసిస్తున్నారనే డాటాను సేకరిస్తుంటారని, డెలివరీ భాగస్వాములను మారుస్తూ, ఒకసారి ఒక పేరు, మరోసారి మరో పేరుతో క్యాష్ ఆన్ డెలివరీ సొమ్మును సొంతం చేసుకుంటారని త్విషా తులి హెచ్చరించింది.
ఇలా చేయండి..
స్కామర్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తులి సూచించింది. డబ్బులు చెల్లించే ముందు ఆర్డర్‌ను కన్ఫామ్ చేసుకోవాలని సూచించింది. ఇంట్లోని పెద్దవాళ్లు పార్సిల్ మీద తమ పేరు ఉందనే కారణంగా దానిని గుడ్డిగా నమ్మవద్దని, అనుమానాస్పద డెలివరీల గురించి కొరియర్ కంపెనీలకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచనలు ఇచ్చింది. నిజానికి విశ్వసనీయ డెలివరీ కంపెనీలకు స్కామ్‌లతో ప్రమేయం ఉండదని, ఆ కంపెనీల విశ్వసనీయతను వాడుకుని మోసగాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి..
ఓజోన్ పొరను కాపాడటం మనందరి బాధ్యత
డెంగ్యూ జ్వరం దరి చేరకూడదంటే.. సింపుల్ చిట్కాలు
For More Latest News