Share News

Bandi Sanjay about KTR: న్యాయపరంగానే ఎదుర్కొంటా.. కేటీఆర్ పరువు నష్టం కేసుపై స్పందించిన కేంద్ర మంత్రి

ABN , Publish Date - Sep 15 , 2025 | 07:38 PM

కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. పరువు నష్టం దావా వేసి తనను బెదిరించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, తాను న్యాయపరంగానే ఎదుర్కొంటానని మంత్రి బండి సంజయ్ తెలిపారు.

Bandi Sanjay about KTR: న్యాయపరంగానే ఎదుర్కొంటా.. కేటీఆర్ పరువు నష్టం కేసుపై స్పందించిన కేంద్ర మంత్రి
Bandi Sanjay

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. పరువు నష్టం దావా వేసి తనను బెదిరించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, తాను న్యాయపరంగానే ఎదుర్కొంటానని బండి సంజయ్ తెలిపారు. కేటీఆర్ లాగా దావాలు వేయాలంటే తాను అనేక కేసులు వేయవచ్చని.. కానీ, తాను ఎవరినీ బెదిరించేందుకు దావాలు వేయనని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు(Bandi Sanjay about KTR).


ఎమ్మెల్యేల ఫోన్లు, తన కుటుంబసభ్యుల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేయించారని గతంలో బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ ఆరోపణలపై ఈ ఏడాది ఆగస్టులో కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్ నుంచి నోటీసులకు రిప్లై రాకపోవడంతో తాజాగా సిటీ సివిల్ కోర్టులో కేటీఆర్ రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు (KTRs defamation case).


ఈ పరువు నష్టం దావాపై బండి సంజయ్ బదులిచ్చారు (Telangna News). పరువు నష్టం దావా వేసినంత మాత్రాన తాను భయపడనని, న్యాయపరంగానే ఎదుర్కొంటానని మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. దమ్ముంటే కుటుంబసభ్యులతో సహా దేవుడు సన్నిధికి రమ్మని సవాల్ విసిరానని.. కేటీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అమెరికాలో కేటీఆర్ ఎవరితో ఉన్నారో తనకు తెలుసని, అయితే తాను వ్యక్తిగత ఆరోపణలు చేయనని బండి సంజయ్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ

టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్

For TG News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 08:47 PM