Home » Komati Reddy Venkat Reddy
గతంలో చాలా అంశాలపైన శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్(పీపీటీ) ఇవ్వడానికి అనుమతించాలంటూ అప్పటి స్పీకర్‌కు తాము లేఖలు రాశామని, అప్పుడు తమకు అవకాశం ఇచ్చారా ? అని బీఆర్ఎస్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిలదీశారు.
సురవరం సుధాకర్ రెడ్డి రెండు సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకున్ని కోల్పోయామని సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హ్యామ్ విధానంలో రాష్ట్రంలో నాణ్యమైన రోడ్లు అతిత్వరలో వేయబోతున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీనా? అంటూ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైరయ్యారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు.
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నేడు హైదరాబాద్‌లో భేటీ కానుంది. మల్లు రవి అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అటు, కొండా మురళి..
భారీ వర్షాల కారణంగా 22 చోట్ల రోడ్లు తెగిపోతే వెంటనే 4 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేసినట్లు మంత్రి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. 171 చోట్లలో ఇంకా కాజ్ వే, కల్వర్టులు వద్ద వరద ప్రవాహం ఉన్నట్లు పేర్కొన్నారు.
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు అన్యాయం జరిగినట్లేనని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగితే ఫర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని.. గత ప్రభుత్వానికి చెప్పానని.. ఈ ప్రభుత్వానికీ చెబుతున్నానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
జగదీష్ రెడ్డి ఫామ్‌హౌస్ 80 ఎకరాలతో కేసీఆర్ జేజమ్మ లెక్క ఉటుందని మంత్రి వెంకట్ రెడ్డి ఆరోపించారు. జగదీష్ రెడ్డి చేసిన అవనీతిపై విచారణ చేపిస్తున్నామని బాంబు పేల్చారు.
మాజీ సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అసలు అద్భుతమే కాదని విమర్శించారు. కాళేశ్వరం నివేదిక రావడంతో.. బీఆర్ఎస్ నాయకులు నోళ్లు మెదపడం లేదని పేర్కొన్నారు. నివేదికతో బీఆర్ఎస్ బాగోతం బట్టబయలైందని తెలిపారు.
రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకు మణిహారమని.. రెండు మూడు నెలల్లో పనులు ప్రారంభించాలనే చిత్తశుద్థితో ఉన్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.