Share News

HAM Scheme: హ్యామ్‌ విధానంలో నాణ్యమైన రోడ్లు

ABN , Publish Date - Aug 22 , 2025 | 04:12 AM

హ్యామ్‌ విధానంలో రాష్ట్రంలో నాణ్యమైన రోడ్లు అతిత్వరలో వేయబోతున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

HAM Scheme: హ్యామ్‌ విధానంలో నాణ్యమైన రోడ్లు

  • కేంద్రం నుంచి అనుమతులపై దృష్టి: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): హ్యామ్‌ విధానంలో రాష్ట్రంలో నాణ్యమైన రోడ్లు అతిత్వరలో వేయబోతున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. టెండరు ప్రక్రియ పూర్తిచేసి, వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. గురువారం సచివాలయంలో ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు.


ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రూ.1,000కోట్ల విలువైన ఆర్‌అండ్‌ బీ రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. పూర్తిగా శిథిలమైనచోట్ల కొత్త రోడ్లు నిర్మించాలని, ఇతరచోట్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాగా, ఖానాపూర్‌ నుంచి బెల్లాం, ఉట్నూర్‌ నుంచి గుడిహత్నూర్‌ వరకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు.. మంత్రి కోమటిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. కాగా, హైదరాబాద్‌లో 8న నిర్వహించనున్న సీఎ్‌సఆర్‌ సమ్మిట్‌ పోస్టర్‌ను మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత సదస్సులో కార్పొరేట్‌, సీఎస్‌ఆర్‌ నిపుణులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Aug 22 , 2025 | 04:12 AM