Share News

Komatireddy Venkat Reddy: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌.. థర్డ్‌ క్లాస్‌ పార్టీనా?

ABN , Publish Date - Aug 22 , 2025 | 04:02 AM

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నీకు థర్డ్‌ గ్రేడ్‌ పార్టీనా? అంటూ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైరయ్యారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేయటం కేటీఆర్‌ అహంకారానికి నిదర్శనమన్నారు.

Komatireddy Venkat Reddy: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌.. థర్డ్‌ క్లాస్‌ పార్టీనా?

  • సోనియాతో ఫొటో మరిచావా?..కేటీఆర్‌పై కోమటిరెడ్డి ధ్వజం

  • కేటీఆర్‌ మైండ్‌ ఖరాబైంది : మంత్రి సీతక్క

  • రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉంటారనే సుదర్శన్‌రెడ్డి ఎంపిక

కరీంనగర్‌/హుస్నాబాద్‌/హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నీకు థర్డ్‌ గ్రేడ్‌ పార్టీనా? అంటూ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైరయ్యారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేయటం కేటీఆర్‌ అహంకారానికి నిదర్శనమన్నారు. ఢిల్లీకి పోయి సోనియాగాంధీతో గ్రూప్‌ ఫొటో దిగన విషయాన్ని మరిచిపోయావా? అని నిలదీశారు. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణ బిడ్డ సుదర్శన్‌రెడ్డి ఉపరాష్ట్రపతి అవ్వడం బీఆర్‌ఎ్‌సకు ఇష్టం లేదంటే.. వారి తెలంగాణవాదంపై సందేహాలు తలెత్తుతున్నాయన్నారు. జగదీశ్‌రెడ్డి గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోనని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సొంత చెల్లెలే తనని వ్యతిరేకిస్తుండడంతో కేటీఆర్‌ మైండ్‌ ఖరాబైందని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. సీఎంను, ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు విమర్శించడం తగదని, థర్డ్‌క్లాస్‌ అంటే తాను చేసిన అవినీతా ? తనకున్న అహంకారమా? కేటీఆరే చెప్పాలన్నారు.


ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదని, తన ఫోన్‌ ట్యాప్‌ చేసి సొంత పార్టీ నేతలే తనను వేధిస్తున్నారంటూ కవిత రాసిన లేఖకు కేటీఆర్‌ ముందు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ బీజేపీకి మద్దతు ఇస్తుందనే విషయాన్ని కేటీఆర్‌ దాచలేకపోయారని, డొంకతిరుగుడు మాటలాపి బీజేపీకి మద్దతిచ్చే ఉద్దేశాన్ని ప్రకటించాలన్నారు. న్యాయ కోవిదుడు రాజ్యసభ చైర్మన్‌ అయితే రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉంటారనే ఉద్దేశంతోనే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అఽభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గోడ మీద ఉన్న బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో బీజేపీ వెంట వెళ్తుందా? తెలంగాణ బిడ్డను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపిన ఇండియా కూటమి వెంట వస్తుందా.. అన్నది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 04:02 AM