Share News

Komatireddy Venkata Reddy: 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు

ABN , Publish Date - Sep 01 , 2025 | 04:37 AM

స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబరు 30 లోపు నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు 10వ తేదీ తర్వాత నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు.

Komatireddy Venkata Reddy: 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు

  • మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబరు 30 లోపు నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు 10వ తేదీ తర్వాత నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నల్లగొండ జిల్లాకు నీళ్లు రాకుండా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. డిమాండ్‌కు అనుగుణంగా కేంద్రం నుంచి యూరియా అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

మంత్రి పదవి రేసులో నేనున్నా: మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి రేసులో తానూ ఉన్నానని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అజారుద్దీన్‌ మంత్రి అయితే తమకేం ఇబ్బంది లేదని, ఆయన మైనారిటీ కోటా లేదా హైదరాబాద్‌ కోటాలో మంత్రి పదవి పొందే అవకాశంఉందని అసెంబ్లీ లాబీలో ఆయనమీడియాతో అన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 04:37 AM