Share News

Komatireddy Venkata Reddy: ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి

ABN , Publish Date - Sep 09 , 2025 | 05:15 AM

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిని ఆ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) మోహన్‌నాయక్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Komatireddy Venkata Reddy: ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి

  • ఆర్‌అండ్‌బీ ఈఎన్సీకి మంత్రి కోమటిరెడ్డి సూచన

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిని ఆ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) మోహన్‌నాయక్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను ఆర్‌అండ్‌బీ ఈఎన్సీగా నియమించడం పట్ల మంత్రికి మోహన్‌నాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎస్‌ఈల నుంచి సీఈలుగా పదోన్నతి పొందిన కిషన్‌రావు, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరావు, లక్ష్మణ్‌ కూడా మంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వ నమ్మకాన్ని, ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని ఇంజినీర్లకు కోమటిరెడ్డి వెంకట రెడి సూచించారు.

Updated Date - Sep 09 , 2025 | 05:15 AM