Home » Kishan Reddy G
రెరా చట్టం వల్ల రియల్ ఎస్టేట్ రంగంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పారదర్శకత, బాధ్యతాయుత పాలన రియల్ ఎస్టేట్ రంగానికి బలమైన పునాది అని తెలిపారు.
హైదరాబాద్ నగరవాసులకు చల్లని కబురు వినిపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు ఊరటనిచ్చే వార్త వెల్లడించారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. సిటీలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తి ఏసీ కోచ్‌లుగా మార్చనున్నట్లు ప్రకటించారు.
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బీజేపీ శ్రేణులకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బాధితులకు ఆహారం, తాగునీటితోపాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని గురువారం ఓ ప్రకటనలో ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్‌షా అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి ముందుగా చట్టం చదవాలని సూచించారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదని స్పష్టం చేశారు. బీసీఈకి ఇప్పటికే 4శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.
రాష్ట్రపతిపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాల నిడిమాండ్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేని రాష్ట్రపతి గురించి మాట్లాడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేసిన ధర్నాలో బీసీలకు న్యాయం చేయడం కన్నా గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలనే తపన సీఎం రేవంత్ రెడ్డిలో అధికంగా కనిపించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి 31 నిమిషాల ప్రసంగంలో.. 50 శాతాని కంటే ఎక్కువ సమయం రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు.. దాన్ని పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ దే అని ఆయన ఉద్ఘాటించారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత, వస్త్ర పరిశ్రమ కీలకమైన భాగమని, దీని ద్వారా దాదాపు 5 కోట్ల మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి లభిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
బీసీల మెడలు కోసేలా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం అన్యాయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఉద్ఘాటించారు. గత 70 ఏళ్లలో కుల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కులగణన చేయని కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పార్లమెంట్ ముందు ముక్కు నేలకు రాయాలని కిషన్‌రెడ్డి విమర్శించారు.