Share News

G. Kishan Reddy: రాష్ట్రంలో మజ్లిస్‌ పార్టీ దౌర్జన్యాలు పెరిగిపోయాయి..

ABN , Publish Date - Oct 24 , 2025 | 09:26 AM

రాష్ట్రంలో మజ్లిస్‌ పార్టీ దౌర్జన్యాలు, రౌడీయిజం, గూండాయిజం పెరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ బాటలోనే పెంచి పోషిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఆరోపించారు.

G. Kishan Reddy: రాష్ట్రంలో మజ్లిస్‌ పార్టీ దౌర్జన్యాలు పెరిగిపోయాయి..

- బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌

- జూబ్లీహిల్స్‌ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో మజ్లిస్‌ పార్టీ దౌర్జన్యాలు, రౌడీయిజం, గూండాయిజం పెరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ బాటలోనే పెంచి పోషిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి(Union Minister G. Kishan Reddy) ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం రాత్రి వెంగళరావునగర్‌ డివిజన్‌ మధురానగర్‌, వెంగళరావునగర్‌ కాలనీలలో పార్టీ అభ్యర్థి లంకాల దీపక్‌ రెడ్డికి మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. మజ్లిస్‌ పార్టీకి చెందిన వ్యక్తి గోరక్షకుడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హత్యాయత్నం చేయడం దారుణమని అన్నారు.


city5.jpg

ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి అద్దం పడుతోందని అన్నారు. మజ్లిస్‌ పార్టీ తరఫున గతంలో పనిచేసిన, పోటీ చేసిన వ్యక్తికే కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వడం.. ఆ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం వెనుకబాటుతనానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని, ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. పని చేసే సమర్థుడైన బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.గౌతమ్‌ రావు, ఓబీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనంద్‌ గౌడ్‌, మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి, బండారు విజయలక్ష్మి, భరత్‌ గౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.


రహమత్‌నగర్‌లో..

జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్‌ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు గురువారం రహమత్‌నగర్‌ డివిజన్‌ కార్మికనగర్‌ పోచమ్మ దేవాలయం వద్ద నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

యూసుఫ్‌గూడలో..

యూసుఫ్‌గూడ డివిజన్‌లోని వెంకటగిరి పొచమ్మ దేవాలయం నుంచి ఎంపీ కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.


బోరబండ, ఎర్రగడ్డలో..

బోరబండ డివిజన్‌ రాజ్‌నగర్‌, వినాయకరావు నగర్‌ బస్తీలలో, ఎర్రగడ్డ డివిజన్‌లోని బంజారానగర్‌, న్యూ సుల్తాన్‌నగర్‌, ఓల్డ్‌ సుల్తాన్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో, శ్రీనగర్‌ కాలనీలో గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని లంకాల దీపక్‌ రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం

విమానాల్లో పవర్‌ బ్యాంకులపై నిషేధం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2025 | 09:26 AM