Share News

Kishan Reddy: దోచుకున్న డబ్బుల కోసమే కేటీఆర్‌, కవిత పంచాయితీ

ABN , Publish Date - Oct 20 , 2025 | 06:44 AM

పదేళ్లుగా దోచుకున్న డబ్బును దాచుకోవడం కోసం కేటీఆర్‌, కవిత గొడవ పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణలో కేసీఆర్‌ రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.

Kishan Reddy: దోచుకున్న డబ్బుల కోసమే కేటీఆర్‌, కవిత పంచాయితీ

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్: పదేళ్లుగా దోచుకున్న డబ్బును దాచుకోవడం కోసం కేటీఆర్‌, కవిత(KTR, Kavitha) గొడవ పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) ఆరోపించారు. మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణలో కేసీఆర్‌ రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. లక్ష్మీనర్సింహనగర్‌ క్రీడా మైదానంలో బీజేపీ బూతు స్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో మార్పు తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన నిరుద్యోగ భృతి, విద్యా భరోసా, మహిళలకు రూ.2500 ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.


city1.2.jpg

కేంద్రప్రభుత్వం మహిళా పొదుపు సంఘాలకు రుణాలు ఇస్తుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్డీలు కూడా రెండు సంవత్సరాలుగా చెల్లించడం లేదన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం(Congress, BRS, MIM) మూడు పార్టీలు కుటుంబ పార్టీలనీ ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సీనియర్‌ నాయకులు శ్రీనివాస్‌, గంగరాజు, ప్రేమ్‌కుమార్‌, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 20 , 2025 | 06:44 AM