Home » Kishan Reddy G
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మంగళవారం సాయంత్రం అసెంబ్లీ సెగ్మెంట్‌లో మహాపాదయాత్ర చేపట్టింది. పార్టీ ముఖ్యనేతలు వివిధ డివిజన్లలో పర్యటించి ఓటర్లను నేరుగా కలిశారు.
తెలంగాణలో రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపోయే యూరియాను కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఎరువుల తయారీ కంపెనీల నుంచి ఎరువులను సేకరించడంతోపాటుగా.. విదేశాల నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకోవడం ద్వారా.. దేశంలో యూరియా కొరత తగ్గించేందుకు కేంద్రం చొరవ తీసుకుందని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.
గోపరిరక్షణను చాలా రాష్ట్రాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పలు రాష్ట్రాలు సబ్సిడీలు అందిస్తున్నాయని ఉద్ఘాటించారు.
హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సబర్మతి నిరాశ్రయులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.
రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు, రౌడీయిజం, గూండాయిజం పెరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీని బీఆర్‌ఎస్ బాటలోనే పెంచి పోషిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు.
పదేళ్లుగా దోచుకున్న డబ్బును దాచుకోవడం కోసం కేటీఆర్, కవిత గొడవ పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణలో కేసీఆర్ రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో దశాబ్దం క్రితం దేశంలో 125గా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాలు.. నేడు 11కు తగ్గాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మిగిలిన ఈ 11 జిల్లాలు కూడా త్వరలోనే నక్సల్ రహిత జిల్లాలుగా మారతాయని ఆశిద్దామని ఆకాంక్షించారు.
పత్తి రైతులు దళారుల చేతిలో పడి మోస పోవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం చివరి క్వింటాల్ వరకు కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని కిషన్ రెడ్డి అన్నారు. నాడు కేసీఆర్ పాలనలో మజ్లీస్ పార్టీ భుజాల మీద మోశారని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందని తెలిపారు. ఈ మూడు పార్టీలు ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు.