Home » Khairatabad
ఖైరతాబాద్ గణపతిని శనివారం మధ్యహ్నం 1.30 గంటల లోపు నిమజ్జనం చేయాడానికి పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గురువారం రాత్రి 12 వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఖైరతాబాద్ ఓ పుణ్యక్షేత్రాన్ని తలపిప్తోంది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఎక్కడ చూసినా భక్తజనమే కనిపించింది.
ఐదవ రోజు ఆదివారం కావటంతో సాధారణ రోజు కంటే భక్తుల రద్దీ మరింత పెరిగింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా గణపతి దర్శనానికి ఏకంగా నాలుగు గంటల సమయం పడుతోంది.
ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి పూజలు వినాయక చవితి రోజున వైభవంగా ప్రారంభమయ్యాయి.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 600 మంది పోలీసులు గణపయ్య ప్రాంగణంలో గస్తీ కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.
ఖైరతాబాద్ గణేశ్ 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు మొదటి రోజు కావడంతో గణేశ్ వద్ద భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు.
ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మహారాష్ట్ర బ్యాండ్ నిలిచింది. ఇంతకాలం ఎంతో అపురూపంగా తయారైన ఖైరతాబాద్ గణేశుడు ఇవాళ భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఏటా ఒక్కో విశిష్ట రూపం... 11 రోజుల్లో 25 లక్షల మంది భక్తుల సందర్శనం... 71 సంవత్సరాలుగా కొనసాగుతున్న మహోత్సవం... భక్తుల పాలిట కొంగు బంగారంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఖైరతాబాద్ గణేశుని ప్రత్యేకతలు అనేకం. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా దర్శనమిస్తున్న ఆ స్వామి విశేషాల మాలిక...
గణపతి ఉత్సవాలకు మరో 15 రోజులు మాత్రమే ఉండడంతో ఖైరతాబాద్ భారీ గణపతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గణపతి ఫినిషింగ్ పనులు జరుగుతుండగా అవి పూర్తి కాగానే ఆర్టిస్టులు రంగులద్దే పనులు ప్రారంభించనున్నారు.