Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తొలి పూజ
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:34 AM
ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి పూజలు వినాయక చవితి రోజున వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఖైరతాబాద్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి పూజలు వినాయక చవితి రోజున వైభవంగా ప్రారంభమయ్యాయి. ముహూర్తం సమయానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మండపం వద్దకు రాగా, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆహ్వానించారు. వేదపండితులు శాస్ర్తోక్తంగా ప్రాణ ప్రతిష్ట చేసి కళశ పూజతో తొలి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.