Share News

Khairatabad Ganesha: నేటి రాత్రి 12 గంటల వరకే దర్శనాలు..

ABN , Publish Date - Sep 04 , 2025 | 06:32 AM

ఖైరతాబాద్‌ గణపతిని శనివారం మధ్యహ్నం 1.30 గంటల లోపు నిమజ్జనం చేయాడానికి పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గురువారం రాత్రి 12 వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Khairatabad Ganesha: నేటి రాత్రి 12 గంటల వరకే దర్శనాలు..

- 6న మధ్యాహ్నం 1.30 గంటల లోపు ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం

ఖైరతాబాద్‌(హైతరాబాద్): ఖైరతాబాద్‌ గణపతిని(Khairatabad Ganesha) శనివారం మధ్యహ్నం 1.30 గంటల లోపు నిమజ్జనం చేయాడానికి పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గురువారం రాత్రి 12 వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి గణపతి కోసం వేసిన షెడ్డు తొలగింపు పనులు ప్రారంభమవుతాయి. శుక్రవారం రాత్రి 12 గంటల తర్వాత విగ్రహాలను ట్రాలీ పైకి చేర్చివెల్డింగ్‌ పనులు చేస్తారని.


city1.2.jpg

శనివారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభిస్తామని, మధ్యాహ్నం 1.30 గంటల లోపు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని సైఫాబాద్‌ ఏసీపీ సంజయ్‌కుమార్‌(Saifabad ACP Sanjay Kumar) తెలిపారు. శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 04 , 2025 | 06:32 AM