Khairatabad Ganesh: పుణ్యక్షేత్రంలా ఖైరతాబాద్.. భారీ గణేశ్ వద్ద తగ్గని రద్దీ
ABN , Publish Date - Sep 02 , 2025 | 06:31 AM
విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఖైరతాబాద్ ఓ పుణ్యక్షేత్రాన్ని తలపిప్తోంది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఎక్కడ చూసినా భక్తజనమే కనిపించింది.
- సొమ్మసిల్లిన పలువురు
- వృద్ధులు, చిన్నారులకు తప్పని అవస్థలు
- నవరాత్రుల్లో రూ.20కోట్ల వ్యాపారాలు!
హైదరాబాద్: విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఖైరతాబాద్(Khairatabad) ఓ పుణ్యక్షేత్రాన్ని తలపిప్తోంది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఎక్కడ చూసినా భక్తజనమే కనిపించింది. భారీగా వస్తున్న భక్తులను విడతలవారీగా శీఘ్ర దర్శనాలు చేయించి పంపేస్తున్నా, అంతలోనే మళ్లీ జనాలు క్యూలో నిండిపోతుండడంతో పోలీసులు అవస్థలు పడ్డారు. సొమ్ములు, పిల్లలు జాగ్రత్త అంటూ పదే పదే పోలీసులు భక్తులను అప్రమత్తం చేశారు.

కాగా దర్శనాల కోసం వచ్చిన పలువురు అస్వస్థతకు గురికావడంతో వలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉన్న వైద్య శిబిరానికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించి పంపారు. లక్షలాదిగా వస్తున్న భక్తుల కోసం పలు రాష్ర్టాలకు చెందిన చిరు వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకుంటూ పొట్టబోసుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేశ్(Khairatabad Ganesh) వద్ద 11 రోజుల్లో దాదాపు రూ.20 కోట్ల వ్యాపారాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News