Khairatabad Ganesh Devotees Visit: ఖైరతాబాద్ గణేశా మాజాకా.. 24 గంటల్లో 4 లక్షల మంది భక్తులు..
ABN , Publish Date - Aug 28 , 2025 | 08:06 PM
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 600 మంది పోలీసులు గణపయ్య ప్రాంగణంలో గస్తీ కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.
హైదరాాబాద్: ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కేవలం హైదరాబాద్ వాసులు మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్దఎత్తున భక్తులు మహా గణపతి దర్శనం కోసం వస్తున్నారు. రెండో రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. 24 గంటల్లో ఏకంగా 4 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నారు. గణనాథుని ప్రాంగణంలో యువతీ, యువకులు సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు.
ఇక, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 600 మంది పోలీసులు గణపయ్య ప్రాంగణంలో గస్తీ కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. పోలీసులతోపాటు 60 సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ జరుగుతోంది. సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకూ భక్తులు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకూ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు.
గణనాథుని ప్రాంగణంలోనే ప్రసవం..
రాజస్థాన్‌కు చెందిన రేష్మ అనే గర్భిణి వినాయక చవితి రోజున ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకోవడానికి వెళ్లింది. సాధారణ భక్తులతోపాటు క్యూలైన్లో నిల్చుని ఉంది. ఉన్నట్టుండి నొప్పులు మొదలయ్యాయి. ఆమె క్యూలైన్‌లోనే కిందపడిపోయింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం ఆమెను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. తల్లి, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..