Home » KCR
బీఆర్ఎస్ చచ్చిన పాము అని, ఆ పామును బతికించేందుకు గోదావరి-బనకచర్ల వివాదాన్ని వాడుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
నీళ్ల సెంటిమెంటే బీఆర్ఎస్‌ను బతికిస్తోందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అందుకోసం పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబుతోపాటు తెలంగాణ ప్రభుత్వాన్ని భూతాలుగా చూపుతున్నారంటూ నేతలను విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన ఇంట్లో బగ్ కూడా పెట్టి ఇంట్లో ఏం జరుగుతుందో లైవ్ సంభాషణ విన్నదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన నడుస్తోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అధికారులందరూ కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహారించారని ఆరోపించారు ప్రభాకర్‌రావు నిబంధనలు అతిక్రమించి మాజీ సీఎం కేసీఆర్ కోసం పనిచేశారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.
దేశ చరిత్రలోనే ఫోన్ ట్యాపింగ్ అతిపెద్ద నేరమని.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ అధినేత చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్‌కు నోటీసులు ఎందుకివ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. నాడు సీఎంవోతోపాటు సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విమర్శించారు.
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను విలన్‌ను చేసే ప్రయత్నం.. ఆయన మేనల్లుడు హరీశ్‌రావు చేస్తున్నాడంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గోదావరి, కృష్ణా నీళ్లను ఏపీ వాడుకోమని సీఎం రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి దాసోహం అయ్యారని విమర్శించారు. నల్లమల ఏ జిల్లాల్లో ఉందో కూడా రేవంత్‌రెడ్డికి తెలియదని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం మంత్రివర్గం తీసుకోలేదని, ఆ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ స్థాయిలోనే తీసుకున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.