KCR Falls Ill Again: కేసీఆర్‌కు మళ్లీ అస్వస్థత
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:19 AM
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శనివారం అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం ఎర్రవల్లి ...
విషయం తెలియగానే స్వయంగా కారు
నడుపుతూ వెళ్లిన కేటీఆర్
ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వైద్యుల బృందం
కేసీఆర్‌ను పరామర్శించిన హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి
గజ్వేల్/మర్కుక్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శనివారం అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం ఎర్రవల్లి ఫాంహౌ్‌సకు చేరుకుని చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ శరీరంలో చక్కెర, సోడియం స్థాయిల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని.. వైద్య బృందం అవసరమైన పరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ అనారోగ్యం గురించి తెలియగానే మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా కారు నడుపుతూ కుమారుడు హిమాన్షుతో కలిసి ఫాంహౌ్‌సకు వచ్చినట్లు సమాచారం. మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి సైతం ఫాంహౌ్‌సకు వచ్చి కేసీఆర్‌ను పరామర్శించినట్లు తెలిసింది. వైద్య బృందం అక్కడే ఉండి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్‌రెడ్డి ఫాంహౌస్‌లోనే ఉండి కేసీఆర్‌కు అందుతున్న వైద్యాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే ఆయన్ను హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉందని సమాచారం.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News