Harish Rao: బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: హరీశ్
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:22 AM
వర్షాలు, వరద ముంపు వల్ల నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
మెదక్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వర్షాలు, వరద ముంపు వల్ల నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. వర్షాల వల్ల విపత్కర పరిస్థితులు తలెత్తి ప్రజలు ఇబ్బంది పడుతుంటే మూసీ సుంరీకరణపై సీఎం సమీక్ష నిర్వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ముంపు ప్రాంత ప్రజలను ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మెదక్ జిల్లాలో వరద ముంపునకు గురైన హవేళీఘనపూర్ మండలంలోని పలు ప్రాంతాల్లో హరీశ్ పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. వరదలో కొట్టుకుపోయి మృతిచెందిన సత్యనారాయణ, యాదాగౌడ్ కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.