Home » Karnataka
ఎలక్ట్రికల్ బస్సులతోనే సమస్య నెలకొందని తరచూ నగరంలో ప్రమాదాలు, బ్రేక్‌డౌన్‌లకు అవే కారణమని రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి(Minister Ramalinga Reddy) తెలిపారు. విధానసౌధలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. యూపీఏ పాలనలో ఎలక్ట్రికల్ బస్సులకు 80శాతం రాయితీ ఇచ్చి కార్పొరేషన్‌లకు అప్పగించేవారన్నారు.
మాజీ ఎమ్మెల్యే బీఎన్ మహా లింగప్ప తన ఇంటి బయట నిలబడి పోటీలను చూస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ ఎద్దు ఆయనపైకి దాడికి దిగింది. కొమ్ములతో కుమ్మి, నేలపై పడేసింది.
కన్నడ నటి దివ్య సురేశ్ పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఈమె కన్నడ బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బైతరాయణపురలోని ఎంఎం రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది.
బెళగావి జిల్లాలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర మాట్లాడుతూ, తన తండ్రి రాజకీయ కెరీర్ చివరి దశలో ఉందన్నారు. ఈ పరిస్థితిలో బలమైన, ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు కావాలని, ఆయనకు సిద్ధరామయ్య మార్గదర్శిగా ఉంటారని చెప్పారు.
తాను మాట్లాడిన మాటలు వివాదాస్పదమైనట్టు తెలియగానే వివరణ ఇచ్చానని యతీంద్ర చెప్పారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై పార్టీలోనే మాట్లాడతానని, మీడియా ముందు మాట్లాడనని అన్నారు.
ఉభయ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యాంకు వరద పొటెత్తుతోంది. ఇన్‌ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో డ్యాం గేట్లు తెరిచి నీరు వదలాలని అధికారులు భావిస్తున్నారు. ఏక్షణమైనా గేట్లు తెరచి నీరు వదిలే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఎంతోమంది కొలిచే చాముండేశ్వరి, మారెమ్మ ఆలయాలు కాంగ్రెస్ వారికి ఇష్టం కావని, ఢిల్లీలోని ఇటలీ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి కప్పం కడితేనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ప్రతిపక్షనేత అశోక్ వ్యాఖ్యానించారు.
తమలపాకు అనేది ఆధ్యాత్మికంగా, వైద్యపరంగా, వస్తుపరంగా ఎంతో ప్రాధాన్యం కలిగినదిగా పరిగణిస్తారు. శాస్ర్తీయ తీగజాతికి చెందిన ఈ ఆకు తేమ, వేడిప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. గుండె ఆకారంలో నిగనిగలాడుతూ ఉండే తమలపాకుకు దక్షిణాసియాలో బీటల్, బెరుయి తదితర పేర్లతో పిలుస్తారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోనుండటం, రొటేషనల్ పద్ధతిలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు పదోన్నత కల్పించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వస్థీకరణ చోటుచేసుకోనుంది.
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పులు జరుగనున్నాయని, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారంటూ కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం వచ్చే నవంబర్‌లో రెండున్నరేళ్లు పాలన పూర్తి చేసుకోనుంది.