Ganavi Suraj Case: గానవి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. కుటుంబసభ్యులపై కేసు..
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:56 PM
కొత్త పెళ్లి కూతురు గానవి కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి.
గానవి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. గానవి కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గానవి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆమె తల్లిదండ్రులేనంటూ అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తెలిపిన వివరాల మేరకు.. సురాజ్‌తో పెళ్లికి ముందే గానవి ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయమం గానవి ఇంట్లో వాళ్లకు తెలియగానే ఆగ్రహానికి గురయ్యారు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే సురాజ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు.
పెళ్లి తర్వాత కొత్త జంట హనీమూన్ కోసం శ్రీలంక వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత గానవి తన ప్రేమ సంగతి భర్తకు చెప్పింది. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేశారని చెప్పింది. ఇది విని సురాజ్ షాక్ అయ్యాడు. హనీమూన్ మధ్యలోనే క్యాన్సిల్ అయింది. ఇద్దరూ బెంగళూరుకు తిరిగి వచ్చేశారు. గానవి కుటుంబసభ్యులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లిపోయారు. డిసెంబర్ 24వ తేదీన గానవి ఆత్మహత్య చేసుకున చనిపోయింది. గానవి మరణానికి కారణంగా సురాజ్ అంటూ ఆమె తల్లి వేధింపులు మొదలు పెట్టింది. సురాజ్ కుటుంబంపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది.
గానవి సూసైడ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూరజ్‌తో పాటు అతడి కుటుంబసభ్యుల్ని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లి జయంతి, సోదరుడు సంజయ్‌తో కలిసి నాగ్‌పూర్ వెళ్లిపోయాడు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. గానవి ఆత్మహత్య చేసుకోవటానికి కారణం సూరజ్ అని ఆరోపిస్తూ గానవి కుటుంబసభ్యులు అతడిపై యుద్ధం ప్రకటించారు. అతడిని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వారి వేధింపులు సూరజ్ తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతడి తల్లి జయంతి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఇవి కూడా చదవండి
శంషాబాద్‌లో దారుణం.. ప్రయాణికుడిపై దాడి చేసి నగదు కాజేసిన దొంగలు
విజయవాడ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: ఎంపీ శివనాథ్