MP Sivanath: విజయవాడ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: ఎంపీ శివనాథ్
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:17 PM
కేబీయన్ కళాశాలకు ఒక చరిత్ర ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎంతోమంది ఇక్కడ చదువుకుని దేశ విదేశాల్లో రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు.
విజయవాడ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (MP Kesineni Sivanath) పిలుపునిచ్చారు. ఇవాళ(ఆదివారం) కేబీయన్ కళాశాల గోల్డెన్ జూబ్లీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్‌తో పాటు వేలాది మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. కేబీయన్ కళాశాలకు ఒక చరిత్ర ఉందని తెలిపారు. ఎంతోమంది ఇక్కడ చదువుకుని దేశ విదేశాల్లో రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు.
అత్యున్నత స్థాయిలో అధికారులను, ప్రజాప్రతినిధులుగా మార్చిందని అన్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా వచ్చి నేడు సమావేశం కావడం ఆనందంగా ఉందని వివరించారు. వారంతా తమ విద్యార్థి జీవితంలో అనుభవాలను పంచుకోవడం వారికి సరికొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపారు. మధ్యతరగతి వారికి ఉపయోగకరంగా ఉండేలా వివిధ రకాల కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. ఫీజులు కూడా పరిమితంగా వసూలు చేస్తూ మంచి విద్యను అందిస్తున్నారని వెల్లడించారు. విద్యా విధానంలో ఈ సంస్థ ఒక ఆణిముత్యమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి కీలక నేతలు
ఈ ఏడాది ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి
Read Latest AP News And Telugu News