Drunken Prank Turns Fatal: తల్లితో ప్రాంక్ చేద్దామనుకున్నాడు.. ప్రాణం పోయింది..
ABN , Publish Date - Dec 31 , 2025 | 06:22 PM
ఓ వ్యక్తి తాగిన మత్తులో తల్లితో ప్రాంక్ చేయాలని చూశాడు. ఊహించని విధంగా ప్రాంక్ ఫెయిల్ అయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..
గత కొన్నేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాంక్‌ల హవా నడుస్తోంది. సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలకు మంచి డిమాండ్ ఉంది. ఫన్నీగా అనిపించే ప్రాంక్ వీడియోలు లక్షలు, మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ప్రాంక్‌లు చేసేవారికి మంచి గుర్తింపు తెస్తున్నాయి. అయితే, కొంతమంది నిజ జీవితంలోనూ ప్రాంక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాంక్‌లు ఫెయిల్ అవుతున్నాయి. ప్రాంక్‌లు ఫెయిల్ అయి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. తాజాగా, ఓ వ్యక్తి తాగిన మత్తులో తల్లితో ప్రాంక్ చేయాలని చూశాడు. ఊహించని విధంగా ప్రాంక్ ఫెయిల్ అయి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు రూరల్ జిల్లా, నేలమంగళలోని రోహిత్ నగర్‌కు చెందిన 28 ఏళ్ల విజయకుమార్ తాగుడుకు బానిస అయ్యాడు. ప్రతీరోజూ విపరీతంగా మందు తాగేవాడు. డబ్బుల కోసం తల్లిని బాగా వేధించేవాడు. అతడి వేధింపులు రోజు రోజుకు పెరిగాయి. నిన్న (మంగళవారం) రాత్రి మందు తాగడానికి డబ్బులు కావాలని విజయ్ తన తల్లిని అడిగాడు. ఆమె ఇవ్వనని తెగేసి చెప్పింది. దీంతో విజయ్ ఆగ్రహానికి గురయ్యాడు. తల్లిని బెదిరించి డబ్బులు గుంజడానికి ఓ ప్రాంక్ చేశాడు.
రాత్రి 8 గంటల సమయంలో ఉరి వేసుకుని చస్తానని తల్లిని బెదిరించే ప్రయత్నం చేశాడు. తలకు ఉరి తాడును బిగించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఉరి తాడు గట్టిగా బిగుసుకుని అతడి ప్రాణాలు పోయాయి. కుమారుడి మరణంపై తల్లి మాట్లాడుతూ.. ‘నా కొడుకు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. అతడి త్వరలో పెళ్లి చేయాలని కలలు కంటూ ఉన్నాను. వాడు ఎప్పుడూ నవ్వు తెప్పించేలా మాట్లాడుతూ ఉండేవాడు. ఉరి వేసుకునే ముందు కూడా జోకులు వేశాడు. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
న్యూ ఇయర్ 2026.. వీసా లేకుండా విదేశీ పర్యటనలు
2026కు ఘనంగా స్వాగతం.. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పిన న్యూజిలాండ్..