New year in New Zealand: 2026కు ఘనంగా స్వాగతం.. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పిన న్యూజిలాండ్..
ABN , Publish Date - Dec 31 , 2025 | 06:05 PM
అక్లాండ్‌లో భారీ సంబరాలతో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. దేశంలోనే ఎత్తైన 'స్కై టవర్' వేదికగా బాణాంసంచా కాల్చి న్యూజిలాండ్ వాసులు సంబరాలు చేసుకున్నారు. నూతన సంవత్సరాన్ని ముందుగా స్వాగతించే దేశాలలో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంటుంది.
ఈ ప్రపంచం మరో కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్ దేశం కొత్త సంవత్సరం 2026ను ఘనంగా ఆహ్వానించింది. అక్లాండ్‌లో భారీ సంబరాలతో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. దేశంలోనే ఎత్తైన 'స్కై టవర్' వేదికగా బాణాంసంచా కాల్చి న్యూజిలాండ్ వాసులు సంబరాలు చేసుకున్నారు. నూతన సంవత్సరాన్ని ముందుగా స్వాగతించే దేశాలలో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంటుంది (New Year celebrations).
భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 4:30 గంటలకు న్యూజిలాండ్.. జనవరి 1, 2026లోకి ప్రవేశించింది. న్యూజిలాండ్ కంటే ముందు పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి అనే ద్వీప దేశం నూతన సంవత్సరాన్ని స్వాగతించింది. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 3:30 గంటలకు కిరిబాటి న్యూ ఇయర్‌లోకి ప్రవేశించింది (first country to celebrate 2026).
న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియాలో కొత్త సంవత్సరం సంబరాలు మొదలవుతాయి (countries entering 2026). భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 6:30 గంటలకు ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, తైవాన్, చైనా, మంగోలియా తదితర దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయి.
ఇవి కూడా చదవండి..
బరువు తగ్గేందుకు జైలుకు వెళ్తున్నారు.. చైనాలో వింత ట్రెండ్ గురించి తెలిస్తే..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం ఎన్ని తాబేళ్లున్నాయో కనిపెట్టండి..