Share News

New Year 2026 Visa Free Countries: న్యూ ఇయర్ 2026.. వీసా లేకుండా విదేశీ పర్యటనలు

ABN , Publish Date - Dec 31 , 2025 | 06:18 PM

న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ దేశాలలో మీరు తక్కువ ఖర్చుతో వీసా ఫార్మాలిటీ లేకుండా, శీతాకాలంలో సరదాగా పర్యటన చేయవచ్చు. నూతన సంవత్సరానికి వీసా లేకుండా సందర్శించదగ్గ దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

New Year 2026 Visa Free Countries: న్యూ ఇయర్ 2026.. వీసా లేకుండా విదేశీ పర్యటనలు
New Year 2026 Visa-Free Countries

ఇంటర్నెట్ డెస్క్: కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మంది విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. అయితే, వీసా సమస్యలు ఉంటే ప్రణాళికలు రద్దవుతాయి. కానీ కొన్ని దేశాలు భారతీయులకు వీసా లేకుండా పర్యటనకు అనుమతిస్తాయి. ఈ దేశాలు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ దేశాలలో మీరు తక్కువ ఖర్చుతో వీసా ఫార్మాలిటీ లేకుండా, శీతాకాలంలో సరదాగా పర్యటన చేయవచ్చు. నూతన సంవత్సరానికి వీసా లేకుండా సందర్శించదగ్గ దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..


భూటాన్

భారతీయులకు భూటాన్‌లోకి ప్రవేశించడానికి వీసా అవసరం లేదు, కానీ ఎంట్రీ పర్మిట్ తప్పనిసరిగా తీసుకోవాలి. దీని కోసం చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ID కార్డు (ఫోటోతో) అవసరం. ఈ పర్మిట్‌ను సరిహద్దు వద్ద లేదా విమానాశ్రయంలో తీసుకోవచ్చు. అక్కడ స్టే చేయడానికి రూ. 4,000 నుండి 8,000 వరకు ఉంటుంది.

Bhutan.jpg

మాల్దీవులు

భారతీయులు మాల్దీవులను కూడా వీసా లేకుండా సందర్శించవచ్చు. జనవరి-ఫిబ్రవరి ఉత్తమ సమయం. ఇక్కడ పాడిల్‌బోర్డింగ్, సూర్యాస్తమయ క్రూయిజ్‌లు ఆస్వాదించవచ్చు. హోటల్ ధరలు రూ. 8,000 – 50,000 వరకు ఉంటాయి.


థాయిలాండ్

భారతీయులకు 30 రోజుల వీసా రహిత ప్రవేశం అందుతుంది. జనవరి-ఫిబ్రవరి మధ్య ఉష్ణోగ్రత 25°–30°C. ఈ సమయంలో తేమ తక్కువగా ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నుండి సులభంగా విమానాలు అందుబాటులో ఉంటాయి. హోటళ్ళు, హోమ్‌స్టేలు తక్కువ బడ్జెట్ నుండి లగ్జరీ వరకు లభిస్తాయి.

Thailand.jpg

మారిషస్

మారిషస్ శీతాకాలపు పర్యటనకు బాగా ప్రసిద్ధి. ఉదయం ఎండ, మధ్యాహ్నం జల్లులు ప్రయాణాన్ని మరింత ఆసక్తికరం చేస్తాయి. ప్రధాన భారతీయ నగరాల నుండి ప్రత్యక్ష విమానాలు 4–5 గంటల్లో అందుబాటులో ఉంటాయి. హోటళ్ళు, రిసార్ట్లు రూ. 4,000 – రూ. 15,000 వరకు ఉంటాయి.


సీషెల్స్

భారతీయులకు 90 రోజుల వీసా రహిత ప్రవేశం అందుతుంది. ఇక్కడ అద్భుతమైన బీచ్‌లు, కేఫ్‌లు, వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. గెస్ట్‌హౌస్‌లు రూ. 5,000 నుండి లగ్జరీ రిసార్ట్‌లు 25,000 వరకు ఉంటాయి.

See sheel.jpg

మలేషియా

భారతీయులకు 90 రోజుల వీసా రహిత ప్రవేశం ఉంది. డిసెంబర్-ఫిబ్రవరి ఉష్ణోగ్రత 24°–30°C. కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ టవర్స్, పెనాంగ్ జార్జ్‌టౌన్, లంకావి బీచ్‌లను చూడవచ్చు. వసతి రూ. 2,500 నుండి ఉంటుంది.


శ్రీలంక

భారతీయులకు 90 రోజుల వీసా రహిత ప్రవేశం ఉంటుంది. జనవరి-ఫిబ్రవరి ఉష్ణోగ్రత 28°–30°C. తేలికపాటి వర్షాలు వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తాయి. గెస్ట్‌హౌస్‌లు రూ. 2,500 నుండి రూ. 5,000 వరకు ఉంటాయి. బీచ్ రిసార్ట్‌లు 8,000 వరకు ఉంటాయి.

Sri Lanka.jpg

నేపాల్

నేపాల్ దేశం భారతీయులకు వీసా లేకుండా ప్రవేశం కల్పిస్తుంది. ప్రసిద్ధ పశుపతినాథ్, బౌద్ధనాథ్ ఆలయాలను సందర్శించవచ్చు. హోటళ్లు రూ. 1,500 నుండి లగ్జరీ హోటళ్లు 10,000 వరకు లభిస్తాయి.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )

Also Read:

న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!

For More Latest News

Updated Date - Dec 31 , 2025 | 06:18 PM