Home » Karimnagar
భూభారతి అమలు, భూ రికార్డుల ప్రక్షాళన, రీ సర్వే తదితర అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో రెవెన్యూ శాఖలో కలవరం మొదలైంది. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాలో పర్యటించి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సమస్యలు, భూ రీ సర్వే, 22-ఏ కేసులు, భూ భారతి దరఖాస్తులు, అసైన్డ్ భూముల సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
నేల తల్లిని నమ్ముకున్న అన్నదాత పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు అనేక కష్టనష్టాలను అనుభవిస్తాడు. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురు నిలవలేక కొందరు రైతులు బలవన్మరణాలను ఆహ్వానిస్తారు. మరికొందరు పంట పొలాల్లో పురుగుల మందులు చల్లుతూ అనారోగ్యానికి గురై, పొద్దంతా కష్టపడి అలసటతో ఊపిరి అగి మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు.
గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన గ్రేడ్లుగా విభజించి.. అందుకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శులను కేటాయించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏ పంచాయతీకి ఏ స్థాయి కార్యదర్శి ఉండాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో గ్రామపాలనలో గందరగోళం నెలకొంటున్నది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం బస్సులు లేక గోదావరరిఖని బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. రద్దీకి అనుగుణంగా అధికారు లు చర్యలు చేపట్టకపోవడంతో గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వచ్చింది.
సింగరేణిలోని కార్మికుల సమస్యలపై యాజ మాన్యం స్పందించిందని, సమ్మె నోటీసులోని 24సమస్యలపై యాజమాన్యంతో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయని గుర్తింపు సంఘం ఏఐటీ యూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ చెప్పారు.
విద్యుత్ అమరుల వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీపీఎం ఏరియా కమి టీ ఆధ్వర్యంలో శుక్రవారం మేడిపల్లి సెంటర్‌లో విద్యుత్ అమ రుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
క్రీడలకు, వ్యాయామానికి రోజుకు ఒక గంట సమయం కేటాయించాలని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి సురేష్ పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తానాబాద్‌లో మూడు రోజుల క్రీడల నిర్వహణ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.
డిగ్రీ, పీజీలు పూర్తిచేసి ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగ యువతకు సాంకే తికత అండగా నిలుస్తోంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితాలో మ్యాపింగ్ చేయని, ఇతర వివరాలు సరిపోలని వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సింగరేణి సంస్థ సహకరించాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సింగ రేణి డైరెక్టర్(ఆపరేషన్స్) సూర్యనారా యణ, ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్, మేయర్ మహంకాళి స్వామితో సమా వేశం నిర్వహించారు.