Home » Kaleshwaram Project
కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అందులో భాగంగానే కేసీఆర్, హరీష్‌రావు.. తెలంగాణ హైకోర్టున ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందనే అబద్ధపు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. గోదావరిలో వరద జలాలను ఒడిసిపట్టకుండా, వృధాగా సముద్రంలోకి వదిలేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మేడిగడ్డ కూలిందని హరీష్ రావుకు గుర్తు లేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయవద్దని చేప్పిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటోందన్నారు. కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం, నీళ్ల విలువ, రైతుల గురించి తెలియదన్న హరీశ్ రావు..
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పుకొచ్చారు. జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ధర్నాకు బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై న్యాయపోరాటం చేసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకోసం సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలిసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక, బీడుబారిన తెలంగాణను మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అని, అతనికి అవినీతి మరక అంటించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ’విచారణ కమిటీ నివేదిక’ పేరుతో కుట్ర పన్నుతోందని మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు.
అప్పు తీసుకొని ఒక వాహనం కొన్నాం. కొనుక్కున్న కొద్ది రోజులకే అది ప్రమాదానికి గురై, బాగా దెబ్బతింది. సాంకేతిక కారణాలతో దాన్ని బాగుచేయడానికి చాలా సమయం పడుతుందని సంబంధిత కంపెనీవాళ్లు చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలను నిజం చేయడానికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.