BRS: అదంతా.. కేసీఆర్‌కు అవినీతి మరక అంటించేందుకే..
ABN , Publish Date - Aug 06 , 2025 | 08:33 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక, బీడుబారిన తెలంగాణను మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అని, అతనికి అవినీతి మరక అంటించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ’విచారణ కమిటీ నివేదిక’ పేరుతో కుట్ర పన్నుతోందని మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు.
- కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ నాయకుల ఆగ్రహం
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక, బీడుబారిన తెలంగాణ(Telangana)ను మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అని, అతనికి అవినీతి మరక అంటించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ’విచారణ కమిటీ నివేదిక’ పేరుతో కుట్ర పన్నుతోందని మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్(BRS) నాయకులు పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ చేసిన కృషిని తెలియజేసేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీ్‌షరావు మంగళవారం నగరంలోని తెలంగాణ భవన్ నుంచి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు వీక్షించేందుకు గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ, కే సీఆర్, హరీశ్‌రావులను అప్రదిష్ట పాల్జేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుందన్నారు. పవర్‌పాయిట్ ప్రజెంటేషన్‌ను వీక్షించిన వారిలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ తదితరులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Read Latest Telangana News and National News