Home » Kakinada
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలులో యూరియా బస్తాల చోరీ యత్నం కలకలం రేపింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు బోగి తాళం పగులగొట్టి యూరియా బస్తాల చోరీకి విఫలయత్నం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ రాజ్యాంగ పదవుల్లో కూర్చుని జీవితాలను శాసిస్తామంటే కుదరదని హెచ్చరించారు.
కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబసభ్యులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. రెండేళ్ల చిన్నారి అదృశ్యమవడం చాలా బాధాకరమని హోం మంత్రి అన్నారు.
కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ కీలక విషయాలు వెల్లడించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఎస్పీతో ఫోన్లో మాట్లాడి, పాప ఆచూకీ కోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటనతో కేసు దర్యాప్తులో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాకినాడ జిల్లాలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఏడు రోజులు దాటినా చిన్నారి జాడ కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
అగ్రహారం గ్రామంలో 3 ఏళ్ల చిన్నారి అదృశ్యమైంది. జాను అనే చిన్నారి ఆడుకుంటూ కనిపించకుండాపోయింది. చిన్నారి మిస్సింగ్‌తో కుటుంబం విషాదంలోమునిగిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించారు.