పవన్, చరణ్‌పై కామెంట్లు.. స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్..
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:37 PM
సినీ సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల అరెస్ట్ అయ్యారు. కాకినాడ పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి, ఏప్రిల్ 15: కామెడీ పేరుతో సినీ సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల అరెస్ట్ అయ్యారు. కాకినాడ పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనుదీప్ సినిమా సెలెబ్రిటీలను కించపరుస్తూ కామెడీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నిహారిక, రామ్ చరణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ వీడియోలను చూసిన మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షో జరుగుతున్న చోటుకు వెళ్లారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న అనుదీప్ అక్కడినుంచి పరారయ్యాడు. రెండు రోజుల తర్వాత మెగా కుటుంబానికి క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. అయినా లాభం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఈస్ట్ గోదావరి జాయింట్ సెక్రటరీ బడే వెంకట కృష్ణ.. కాకినాడ పోలీస్ స్టేషన్‌లో అనుదీప్‌పై ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న కాకినాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మెగా ఫ్యాన్స్ దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి అనుదీప్ అజ్ఞాతంలో ఉంటున్నాడు. కాకినాడ పోలీసులు అనుదీప్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడి జాడ కనుక్కున్నారు. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని ఓ పార్క్‌లో కుటుంబసభ్యులతో పాటు ఉన్న అతడిని కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ నుంచి ఏపీకి తీసుకువస్తున్నారు.
ఇవి కూడా చదవండి
దద్దరిల్లిన సారండా అటవీ ప్రాంతం.. మావోలు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్
స్లో ఓవర్ రేట్: ప్లేయర్లకు కాదు.. అంపైర్లకు జరిమానా విధించాలి: ఎంసీసీ హెడ్ ఫ్రేజర్ స్టీవార్ట్