Share News

దద్దరిల్లిన సారండా అటవీ ప్రాంతం.. మావోలు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు..

ABN , Publish Date - Apr 15 , 2026 | 03:36 PM

జార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. చోటా నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబుదేరా అడవిలో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున ఇరువర్గాలు ఎదురుపడ్డాయి.

దద్దరిల్లిన సారండా అటవీ ప్రాంతం.. మావోలు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు..
Jharkhand Encounter

రాంచీ: జార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. చోటా నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబుదేరా అడవిలో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున ఇరువర్గాలు ఎదురుపడ్డాయి. దీంతో వారి మధ్య ఎదురుకాల్పులు మెుదలయ్యాయి.


ఈ దాడిలో పలువురు మావోలకు బుల్లెట్ గాయాలు అయ్యాయని, మరికొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మిసిర్ బెస్రా కోసం బాబుదేరా అడవిలో సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్, జార్ఖండ్ జాగ్వార్, జిల్లా పోలీస్ సంయుక్త బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్ జరిగింది.


ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ..'మిసిర్ బెస్రా కోసం భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. వారిని చూడగానే తొలుత మావోయిస్టు దళం కాల్పులు జరిపింది. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు చనిపోయినట్లు అనుమానిస్తున్నాం. అయితే, ఇంతవరకూ మృతదేహాలు లభించలేదు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి' అని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎంపీల పెంపు అవసరమా? 'వికసిత భారత్'కు కావాల్సింది బలమైన అసెంబ్లీలా?

స్లో ఓవర్ రేట్: ప్లేయర్లకు కాదు.. అంపైర్లకు జరిమానా విధించాలి: ఎంసీసీ హెడ్ ఫ్రేజర్ స్టీవార్ట్

Updated Date - Apr 15 , 2026 | 03:49 PM