ఇరాన్‌తో చర్చలు.. అమెరికా పెట్టిన రెండు షరతులు అవేనా..
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:00 PM
ఇస్లామాబాద్ వేదికగా రెండోసారి అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చలు వారం రోజుల్లోపే ఉండొచ్చని ట్రంప్ తెలిపారు. సరైన వ్యక్తులు వాషింగ్టన్‌ను పిలిచారని, వారు ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇస్లామాబాద్ వేదికగా రెండోసారి అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చలు వారం రోజుల్లోపే ఉండొచ్చని ట్రంప్ తెలిపారు. సరైన వ్యక్తులు వాషింగ్టన్‌ను పిలిచారని, వారు ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, శాంతి చర్చలకు వచ్చే ఇరాన్ నాయకులకు అమెరికా రెండు షరతులు పెట్టింది. ఈ మేరకు అమెరికా దౌత్య వర్గాలను ఊటంకిస్తూ ఇజ్రాయెల్ మీడియాలో ఓ వార్త వచ్చింది (US Iran talks restart).
రెండోసారి చర్చల ప్రారంభానికి ముందు అమెరికా రెండు షరతులు పెట్టిందని ఇజ్రాయెల్ వెల్లడించింది. హోర్ముజ్ జలసంధిలో ఎలాంటి ఆంక్షలూ లేకుండా పూర్తిగా తెరవాలనేది మొదటి షరతు. అలాగే, చర్చలకు వచ్చే ఇరాన్ ప్రతినిధులు ఒప్పందంపై నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఐఆర్‌జీసీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలనేది రెండో షరతు. ఈ రెండు నిబంధనలకు టెహ్రాన్ అంగీకరిస్తే శాంతి చర్చలకు తాము సిద్ధమని అమెరికా తెలిపినట్టు సదరు మీడియా కథనం పేర్కొంది (US Iran negotiations conditions).
శాంతి చర్చలకు సంబంధించి ఇరాన్ పాలకవర్గంలో విభేదాలు తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి (Strait of Hormuz reopening). ముఖ్యంగా ఐఆర్‌జీసీ నుంచి వ్యతిరేకత వస్తున్నట్టు సమాచారం. చర్చల సమయంలో అమెరికా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఇరాన్ ప్రతినిధుల బృందానికి ఐఆర్‌జీసీ అనుమతినివ్వలేదని తెలుస్తోంది. ఐఆర్‌జీసీ తీరు పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు కూడా సదరు కథనం పేర్కొంది. అందుకే శాంతి చర్చల కోసం ఐఆర్‌జీసీ నుంచి అనుమతి తీసుకురావాలని అమెరికా కోరినట్టు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన పుత్తడి.. తగ్గిన వెండి ధరలు
For More AP News And Telugu News