Home » Kadiri
పట్ణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఎస్‌సీఎఫ్ క్రీడల్లో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆల్ రౌండ్ ఛాంపియన షిప్ గెలుచుకున్నారు. రెండో స్థానంలో ఏపీ ట్రైబుల్ వెల్ఫేర్ పాఠ శాల, మూడో స్థానంలో పట్నం పాఠశాల నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇలా ఉంటే .. గ్రామంలోకి వెళ్లేది ఎలా.. బయటకు వచ్చేది ఎలాగని చిన్నరామన్నగారిపల్లి గ్రామస్థులు ప్ర శ్నిస్తున్నారు. గ్రామంలోకి వెళ్లే కూడలి వద్ద వర్షపునీరు నిలిచి దోమలకు నిలయంగా మారింది. కూడలి మొత్తం బురదమయమై గ్రామంలోకి వెళ్లడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది. నీరు నిలువ ఉండటంతో దోమలు పెరిగి రోగాలబారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెం దుతున్నారు.
అర్హులైన భవన నిర్మాణ కార్మి కులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాల యానికి ఎదురుగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల కాలనీని గురువారం ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులలో అర్హులైన వారంద రికీ న్యాయం చేస్తామని తెలిపారు.
నత్త అంటే ఎక్కడో ఒకటో, రెండో కనిపిస్తుంటాయి. అలాంటి నత్తలు లక్షలాదిగా దండుగా ఏర్పడి, పంటలను నాశనం చేస్తున్నాయి. రైతులు లక్షలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలను మొక్క దశలోనే దెబ్బతీస్తున్నాయి. మండలంలోని మహమ్మదాబాద్ పంచాయతీ పరిధి గొల్లపల్లి ప్రాంతంలో లక్షలాది నత్తలు పంటల్లో సంచరిస్తున్నాయి.
మండల పరిధిలోని ముండ్లవారిపల్లి సమీపంలో పాపాగ్నినదికి అడ్డంగా నిర్మించిన చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్ట్ నిండుకుం డా దర్శనమిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థా యి నీటి మట్టం 27 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 26.12 అడుగులకు నీరు చేరింది.
నల్లమాడ మండలంలోని ఎన్.ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన చిల్లా చిన్నగంగప్ప(54) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న చిల్లా పెద్ద గంగప్ప తెలిపిన మేరకు... ఆరు నెలల కిందట చిన్నగంగప్ప అల్లుడు భాస్కర్ మృతిచెందాడు.
పట్టణంలోని తహసీల్దార్ కార్యాల యం వద్ద ఉన్న బాలికల హాస్టల్ సమీపంలో ప్రైవేటు కార్లు, ట్యాక్సీలను నిలుపకుండా ఆర్టీ డిపో ఆవరణంలో అద్దె వాహనాల స్టాండ్ ఏర్పాటు చే యాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కోర్టులలో నెలకొన్న సమస్యలు, న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ పరిశీలనలో ఉన్నా యని, త్వరలోనే పరిష్కార మార్గం వస్తుందని జిల్లా ప్రధాన న్యాయా ధికారి భీమారావు అన్నారు. న్యాయా ధికారి శనివారం కదిరిలోని కోర్టుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక న్యాయాధికారులు ఎస్ జయ లక్ష్మి, పి. లోకనాథం, న్యాయవాదులు తదితరులు ప్రధాన న్యాయాధికారికి స్వాగతం పలికారు.
మునిసిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ళ లో పేరుకుపో యిన చెత్త కంపుకొడుతోంది. గ్రామం నుంచి వచ్చే మొత్తం చెత్తను కుటాగుళ్ళలోని కదిరి- పులివెందుల రహదారిలో పవర్ ఆఫీస్ వెనక పారబోస్తున్నారు. కుళ్లిన ఈ చెత్త అటువైపుగా వెళితే కంపుకొడుతోం ది. రోడ్డు పక్కనే చెత్తనంతా వేసి డంపింగ్ యార్డ్‌గా తయారు చేశారని పలువురు విమర్శిస్తున్నారు.
నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ని యోజవర్గంలో చేపట్టిన, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఆయన బుధ వారం పట్టణంలోని అర్ అండ్ బీ బంగ్లాలో వివిధ శాఖల అధికారులు, ఇంజనీర్ల తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన అధికారులు, ఇంజనీర్ల సమీక్షలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.