MLA: హాస్టల్ వద్ద ప్రైవేటు వాహనాలు వద్దు
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:50 PM
పట్టణంలోని తహసీల్దార్ కార్యాల యం వద్ద ఉన్న బాలికల హాస్టల్ సమీపంలో ప్రైవేటు కార్లు, ట్యాక్సీలను నిలుపకుండా ఆర్టీ డిపో ఆవరణంలో అద్దె వాహనాల స్టాండ్ ఏర్పాటు చే యాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అధికారులకు ఎమ్మెల్యే కందికుంట ఆదేశం
కదిరి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని తహసీల్దార్ కార్యాల యం వద్ద ఉన్న బాలికల హాస్టల్ సమీపంలో ప్రైవేటు కార్లు, ట్యాక్సీలను నిలుపకుండా ఆర్టీ డిపో ఆవరణంలో అద్దె వాహనాల స్టాండ్ ఏర్పాటు చే యాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బాలికల ఉన్నత పాఠశాల, హాస్టల్ వద్ద ప్రైవేటు ట్యాక్సీ లు ఉండటం వల్ల బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తహసీ ల్దార్ కార్యాలయం ఆవరణంలో ఉన్న కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే పట్టణానికి నలువైపులా కూరగాయలు అందుబాటులో ఉండే విధంగా చిన్నపాటి మార్కెట్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం కూ రగాయల మార్కెట్ వెనుక ఉన్న జంతువధశాలను పట్టణానికి దూరంగా తరలించాలని అఽధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల సమస్యలు తెత్తకుండా పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, పట్టణ సీఐ నారాయణరెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ మైనుద్దీన, ఎంఈఓ చెన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....