Share News

GARBAGE: రోడ్డు పక్కనే చెత్త డంపింగ్‌

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:24 AM

మునిసిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ళ లో పేరుకుపో యిన చెత్త కంపుకొడుతోంది. గ్రామం నుంచి వచ్చే మొత్తం చెత్తను కుటాగుళ్ళలోని కదిరి- పులివెందుల రహదారిలో పవర్‌ ఆఫీస్‌ వెనక పారబోస్తున్నారు. కుళ్లిన ఈ చెత్త అటువైపుగా వెళితే కంపుకొడుతోం ది. రోడ్డు పక్కనే చెత్తనంతా వేసి డంపింగ్‌ యార్డ్‌గా తయారు చేశారని పలువురు విమర్శిస్తున్నారు.

GARBAGE: రోడ్డు పక్కనే చెత్త డంపింగ్‌
Garbage stored behind power office

కదిరి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ళ లో పేరుకుపో యిన చెత్త కంపుకొడుతోంది. గ్రామం నుంచి వచ్చే మొత్తం చెత్తను కుటాగుళ్ళలోని కదిరి- పులివెందుల రహదారిలో పవర్‌ ఆఫీస్‌ వెనక పారబోస్తున్నారు. కుళ్లిన ఈ చెత్త అటువైపుగా వెళితే కంపుకొడుతోం ది. రోడ్డు పక్కనే చెత్తనంతా వేసి డంపింగ్‌ యార్డ్‌గా తయారు చేశారని పలువురు విమర్శిస్తున్నారు. మునిసిపాలిటీలో మూడు వార్డులు ఉన్న పెద్ద శివారు ప్రాంతం కుటాగుళ్ళ. ఇక్కడ డంపింగ్‌యార్డ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే మునిసి పాలిటీ అధికారులు ఆ రకంగా ఆలోచించడమే మానేశారు. అంతేగాకుండా మునిసిపల్‌ అధికారులు కుటాగుళ్ళ ప్రజల నుంచి ఇంటిపన్నుతో పాటు కొళాయి పన్ను కూడా ముక్కు పిండి వసూ లు చేస్తున్నారు. కానీ ఆ గ్రామ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తి గా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో 10వేల వరకు జనాభా ఉంది. ఇంత పెద్ద గ్రామానికి మునిసిపల్‌ కార్మికులు కూడా అరకొరగానే ఉన్నారు. మునిసిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ పల్లె కంటే అధ్వానంగా ఇక్కడ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పకైనా మునిసి పల్‌ అధికారులు స్పందించి పవర్‌ ఆఫీస్‌ వెనుక ఉన్న డంపింగ్‌యార్డ్‌ను తొలగించాలని, ప్రత్యేకంగా కంపోస్ట్‌ యార్డ్‌ను ఏర్పాటు చేయాలని స్థాని కులు కోరుతున్నారు. అలాగే గ్రామంలో తాగునీరు, వీధి లైట్‌లు, మురు గునీటి కాలువలను సక్రమంగా నిర్వహించాలని వారు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 19 , 2025 | 12:24 AM