JUDGE: అన్ని సమస్యలకు త్వరలో పరిష్కారం
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:33 AM
కోర్టులలో నెలకొన్న సమస్యలు, న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ పరిశీలనలో ఉన్నా యని, త్వరలోనే పరిష్కార మార్గం వస్తుందని జిల్లా ప్రధాన న్యాయా ధికారి భీమారావు అన్నారు. న్యాయా ధికారి శనివారం కదిరిలోని కోర్టుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక న్యాయాధికారులు ఎస్ జయ లక్ష్మి, పి. లోకనాథం, న్యాయవాదులు తదితరులు ప్రధాన న్యాయాధికారికి స్వాగతం పలికారు.
న్యాయవాదులు సహకరించాలి: జిల్లా ప్రధాన న్యాయాధికారి
కదిరి లీగల్, అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): కోర్టులలో నెలకొన్న సమస్యలు, న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ పరిశీలనలో ఉన్నా యని, త్వరలోనే పరిష్కార మార్గం వస్తుందని జిల్లా ప్రధాన న్యాయా ధికారి భీమారావు అన్నారు. న్యాయా ధికారి శనివారం కదిరిలోని కోర్టుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక న్యాయాధికారులు ఎస్ జయ లక్ష్మి, పి. లోకనాథం, న్యాయవాదులు తదితరులు ప్రధాన న్యాయాధికారికి స్వాగతం పలికారు. కోర్టు ఆవరణలోనే పోలీసు వందనం స్వీకరించారు. అనంతరం న్యాయవాదుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమా వేశంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆదనపు కోర్టుల అవసరాన్ని ప్రధాన న్యాయాధికారి దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రధాన న్యాయాధికారి మాట్లాడుతూ... ఇప్పటికే అనేక విజ్ఞప్తులు ఉన్నాయని ఆదనంగా కోర్టుల ఏర్పాటును త్వరలోనే చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆనవాయితీ ప్రకారం న్యాయాధికారిని న్యాయవాదుల సంఘం అఽధ్యక్షుడు చౌడప్ప ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని బహుకరించారు. ప్రధాన న్యాయాధికారి వెంట స్ధానిక న్యాయాధికారులు ఎస్ జయలక్ష్మి, పి లోకనాథం ఉన్నారు. ఈ సమా వేశంలో న్యాయవాదులు ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రబాబు, లోకేశ్వర్‌రెడ్డిడ, సుబ్బరాజుగుప్తా, తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయాధికారిని ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....