Share News

DAM: నిండుకుండలా సీజీ ప్రాజెక్ట్‌

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:14 PM

మండల పరిధిలోని ముండ్లవారిపల్లి సమీపంలో పాపాగ్నినదికి అడ్డంగా నిర్మించిన చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్ట్‌ నిండుకుం డా దర్శనమిస్తోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థా యి నీటి మట్టం 27 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 26.12 అడుగులకు నీరు చేరింది.

DAM: నిండుకుండలా సీజీ ప్రాజెక్ట్‌

తనకల్లు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ముండ్లవారిపల్లి సమీపంలో పాపాగ్నినదికి అడ్డంగా నిర్మించిన చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్ట్‌ నిండుకుం డా దర్శనమిస్తోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థా యి నీటి మట్టం 27 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 26.12 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్ట్‌ నీటి సామర్థ్యం 170 ఎంసీఎ్‌ఫటీగా ఉంది. బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత గానీ, గురువారం ఉదయం కానీ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్ల ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో, అమడగూరు మం డలంలో భారీగా వర్షాలు పడుతుండటంతో వందమానేరు ద్వారా సీజీ ప్రాజెక్ట్‌లోకి నీరుచేరినట్లు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 22 , 2025 | 11:14 PM