Home » KADAPA
జడ్పీటీసీ ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్ప వని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ హెచ్చరించారు. డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పులివెందుల జడ్పీటీసీని కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో గెలుచుకుని రావాలని.. తాను పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు.
శివశంకర్‌ను నాలుగు వారాల్లోగా ఏపీకి కేటాయించాలంటూ.. క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. శివశంకర్‌ను ఏపీకి బదిలీ చేయాలని హైకోర్టు జూలై 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు జూలై 31తో ముగిసింది. అయితే.. ఇప్పటికీ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై శివశంకర్ క్యాట్‌ను ఆశ్రయించారు.
పార్టీల అభ్యర్థులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ మురళి నాయక్ సూచించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం వల్ల నల్లగొండ వారి పల్లెలో ఘర్షణ జరిగిందని గుర్తు చేశారు.
నాన్న గొడ్డలిపోటుతో పడిఉంటే.. గుండెపోటు అని చెప్పారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచేసారని ఆరోపించారు. హత్య తరువాత కొందరు వ్యక్తులు లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బిటెక్ రవి హత్య చేసారని తనని సంతకం పెట్టామన్నారని ఆమె తెలిపారు
మాజీ సీఎం జగన్ మాటలతో జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని వివేకా హత్య కేసు సాక్షి దస్తగిరి అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తమ్ముడు అహ్మద్ బాషా అండతో.. రాయచోటిలోని జగన్ అనుచరులు భూకబ్జాలు చేశారని ఆరోపించారు
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-బీదర్ (06519) ప్రత్యేకరైలు ఈ నెల 14న బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం పదకొండున్నరకు బీదర్‌కు చేరుకుంటుందన్నారు.
కడప జిల్లాలో ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పులివెందుల నుంచి 11 మంది పోటీ చేస్తుండగా ఒంటిమిట్ట నుంచి కూడా 11 మందే బరిలో ఉన్నారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు.
తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్‌స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మిన్‌సలో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుందన్నారు.
తిరుత్తణి సమీపంలో సోమవారం వేకువజాము సంభవించిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన అన్నదమ్ములు మృతి చెందారు. వివరాలిలా. పీలేరుకు చెందిన మాజీ సర్పంచ్ హుమయూన్ (70) అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.