Share News

‘స్త్రీ శక్తి’ మహిళలకు వరం

ABN , Publish Date - Aug 15 , 2025 | 11:43 PM

మహిళలను ఆదు కోవడానికి రాష్ట్రప్రభుత్వం స్త్రీ శక్తి పథకం సూపర్‌ సిక్స్‌ పథకా ల్లో ఒకటని, శుక్రవారం మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో మదన పల్లె సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రారంభించారు

‘స్త్రీ శక్తి’ మహిళలకు వరం
మదనపల్లెలో బస్సును ప్రారంభిస్తున్న సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, ఎమ్మెల్యే షాజహాన్‌బాష

మదనపల్లెలో ప్రారంభించిన సబ్‌కలెక్టర్‌, ఎమ్మెల్యే

మదనపల్లె అర్బన్‌, ఆర్టీస్టు 15(ఆంధ్రజ్యోతి): మహిళలను ఆదు కోవడానికి రాష్ట్రప్రభుత్వం స్త్రీ శక్తి పథకం సూపర్‌ సిక్స్‌ పథకా ల్లో ఒకటని, శుక్రవారం మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో మదన పల్లె సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రారంభించారు సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఎందరో మహిళలకు లబ్ధిచేకూరుతోందన్నారు. ఎమ్మెల్యే షాజహా న్‌ బాష మాట్లాడుతూ మదనపల్లె వన్‌, టూ డిపోల పరిధిలో 165 బస్సులు మహిళ కోసం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో సీఎం నారా చంద్ర బాబు నాయుడు, మంత్రి నారాలోకేశ్‌ ఇచ్చిన హామీలను నేరవే రుస్తూ ప్రజల మన్ననులు పొందుతున్నారన్నారు. తహసీల్దార్‌ కిషోర్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్లు వెంకటరమణారెడ్డి, అమరనాథ్‌, టీడీపీ నేతలు నీలకంఠ సిద్దప్ప, జాన్‌బాబు, జేసీబీ మధు, మల్లికార్జున నాయుడు, లక్ష్మున్న, చిప్పిలి చెండ్రాయుడు, వెంకటరమణారెడ్డి, భాస్కర్‌, డాన్స్‌ రెడ్డెప్ప పాల్గొన్నారు.

ఉచిత బస్సును ప్రారంభించిన టీడీపీ ఇన్‌చార్జి

తంబళ్లపల్లె, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న (స్త్రీ శక్తి పథకం) ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు వరమని టీడీపీ ఇన్‌చార్జి దాసరి పల్లె జయచంద్రారెడ్డి అన్నారు. తంబళ్లపల్లె ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. సీఐ రేవతి, ప్రత్యేకాధికారి అమర్‌నాథ్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి నాయుడు, తులసీధర్‌ నాయుడు, పార్లమెంటు తెలు గు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, సోము, నరసిం హులు, బీసీ నేత మాదారపు చంద్రశేఖర్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జి బేరి శీన, మాజీ జడ్పీటీసీ సభ్యులు రామచంద్ర, పురుషోత్తం, కుక్కరాజు పల్లె మదన, సుబ్రమణ్యం, వీరాంజనేయులు పాల్గొన్నారు.


15Plr17.gif స్త్రీ శక్తి సర్వీసును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి

పీలేరులో స్త్రీ శక్తి సర్వీసులు ప్రారంభం

పీలేరు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఎంతో ఉన్నతాశ యంతో ప్రవేశ పెట్టిన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సద్విని యోగం చేసుకోవాలని మహిళలకు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కు మార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పీలేరు ఆర్టీసీ బస్టాండులో స్త్రీ శక్తి ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. రాష్ట్ర జంగం కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసునూరి చంద్రశేఖర్‌, డీఆర్‌డీఏ పీడీ సత్య నారాయణ, పీలేరు డీఎం నిర్మల, ఏఎంసీ చైర్మన్‌ పురం రా మ్మూర్తి, సింగిల్‌ విండో అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు అమరనాథ రెడ్డి, శ్రీనాథరెడ్డి, టీడీపీ నేతలు కోట పల్లె బాబు, మల్లెల రెడ్డిబాషా, శ్రీకాంత్‌ రెడ్డి, నల్లారి రియాజ్‌, పురం రెడ్డమ్మ, సాధన, లక్ష్మీకాంతమ్మ, షమ పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 11:43 PM