రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:50 PM
రాజంపేట జిల్లా కేంద్రం చేయాలంటూ రాజంపేట జిల్లా సాధన సమితి సభ్యులు సమావేశం నిర్వహించారు. రాజంపేట ఆర్‌అండ్‌బి ఆవరణంలో జిల్లా సాధన సమితి కన్వీనర్, న్యాయవాది టి.లక్ష్మీనారాయణ, ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌నాయుడు, జిల్లా డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అద్యక్షులు గీతాంజలి రమణ తదితరుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
రాజంపేట, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాజంపేట జిల్లా కేంద్రం చేయాలంటూ రాజంపేట జిల్లా సాధన సమితి సభ్యులు సమావేశం నిర్వహించారు. రాజంపేట ఆర్‌అండ్‌బి ఆవరణంలో జిల్లా సాధన సమితి కన్వీనర్, న్యాయవాది టి.లక్ష్మీనారాయణ, ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌నాయుడు, జిల్లా డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అద్యక్షులు గీతాంజలి రమణ తదితరుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో చారిత్రక పర్యాటక ప్రాంతమైన అన్ని వనరులు కలిగిన పార్లమెంట్, రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రాజంపేటను గత జగన్ ప్రభుత్వం దురుద్దేశ్యంతో జిల్లాకేంద్రం చేయలేదని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏర్పాటు చేసిన నూతన జిల్లాల మంత్రుల సబ్‌కమిటీ త్వరలో సమావేశాలు జరుగుతున్నందున రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ తీర్మానించారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ గతంలో అనేక ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు చేసిన ఆందోళనలు వినతులను జగన్ ప్రభుత్వం బూడిదలో పోసిన పన్నీరుగా మార్చిందన్నారు. ఈ సమయంలో ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాద్రిగా చేసినట్లు విమానాశ్రయం, రైల్వే, ఇతర అన్ని అర్హతలున్న రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్నారు. బ్రిటీష్ హయాంలో కంటే ముందు 105 సంవత్సరాల కిందట రాజంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేసి సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి అన్ని వనరులు అర్హతలు ఉన్నఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ తీర్మానించారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతున్నట్లు జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు త్వరలో మంత్రుల సబ్‌కమి మన్నూరు నాయకులు పోకల ప్రబాకర్, మైనార్టీ గుల్జార్‌బాషా, సీనియర్ పాత్రికేయులు ఎస్.కళాంజలి, మైనార్టీ నాయకులు అబూబకర్ తదితరులు పాల్గొన్నారు.