నేడు మాంసం విక్రయించొద్దు : కమిషనర్
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:48 PM
స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా మున్సిపాలిటీ పరిదిలో మాంసం దుకాణాలు మూసివేయాలని మాంసం విక్రయాలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరించారు.
రాజంపేటటౌన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా మున్సిపాలిటీ పరిదిలో మాంసం దుకాణాలు మూసివేయాలని మాంసం విక్రయాలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న వేళ మాంసం విక్రయాలు నిర్వహించరాదన్న నిబంధన ఉందన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో మున్సిపల్ పరిధిలో జంతుబలులు జరిగిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. జంతు మాంస విక్రకయాలు జరుగుతున్నట్లు తెలిసినా తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు.