గృహ నిర్మాణాలు పూర్తికాకపోతే రద్దు
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:47 PM
మండలంలో మంజూరు చేసిన పీఎం ఆవాస్ యోజన పక్కా గృహాలు పొందిన లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకోకపోతే రద్దవుతాయని, దాని ఫలితంగా లబ్ధిదారులు ఇప్పటివరకు తీసుకున్న ప్రభుత్వ సొమ్ము వెనక్కు ఇచ్చేయాల్సి వస్తుందని మండల ప్రత్యేక అధికారి పవన్‌కుమార్‌రెడ్డి లబ్ధిదారులకు సూచించారు.
పెనగలూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలో మంజూరు చేసిన పీఎం ఆవాస్ యోజన పక్కా గృహాలు పొందిన లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకోకపోతే రద్దవుతాయని, దాని ఫలితంగా లబ్ధిదారులు ఇప్పటివరకు తీసుకున్న ప్రభుత్వ సొమ్ము వెనక్కు ఇచ్చేయాల్సి వస్తుందని మండల ప్రత్యేక అధికారి పవన్‌కుమార్‌రెడ్డి లబ్ధిదారులకు సూచించారు. గురువారం పెనగలూరు జగనన్న లేవుట్‌ను ఆయన తనిఖీ చేసి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా జగనన్న కాలనీలోకి వచ్చే రహదారి చాలా దుర్భరంగా ఉందని, కనీసం చిన్న చిన్న వాహనాలైన హౌసింగ్ మెటీరియల్ తీసుకొని వచ్చేందుకు అనువుగా రోడ్డుకు మరమ్మతులు చేయాలని లబ్ధిదారులు కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ హరిప్రసాద్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సుజ్ఞాని, గ్రామ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.