Share News

వేడుకగా జన్మాష్టమి

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:18 PM

వాడవాడ లా జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పలువు రు ప్రముఖులు కృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. శ్రీకృష్ణ ఆలయాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆలయాల్లో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుడి కళ్యాణం వైభవంగా నిర్వహిం చారు.

వేడుకగా జన్మాష్టమి
మదనపల్లెలో భక్తులతో సందడిగా శ్రీకృష్ణుడి ఆలయం

Untitled-1.gif

కృష్ణుడిని దర్శించుకున్న ప్రముఖులు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

వైభవంగా రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణుడి కళ్యాణం

మదనపల్లె టౌన్‌/అర్బన్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): వాడవాడ లా జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పలువు రు ప్రముఖులు కృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. శ్రీకృష్ణ ఆలయాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆలయాల్లో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుడి కళ్యాణం వైభవంగా నిర్వహిం చారు. పట్టణం, అనపగుట్ట, గోవర్థనగిరిలోని శ్రీకృష్ణాలయం లో శనివారం జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. రుక్మిణీ, సత్యభామ సమేత కృష్ణుడిని అలంకరించి పంచామృతాభి షేకం, అర్చనలు నిర్వహించారు. అనంతరం కన్నుల పండువ గా కళ్యాణోత్సవం చేశారు. ఆలయంలో పిల్లల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్నపనోత్సవం తరువాత వసంతోత్సవం జరిపించారు. సాయంత్రం ఉట్లోత్స వంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే షాజహా న్‌ బాష టీడీపీ నేతలతో కలిసి స్వామివారి పూజలో పాల్గొ న్నారు. యాదవులు సంఘటితమై శ్రీకృష్ణ దేవస్థానం నిర్మిం చుకుని జన్మాష్టమి వేడుకగా నిర్వహించడం అభినందనీయ మన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు.


మాజీ ఎమ్మెల్యేలు నవాజ్‌బాషా, దేశాయ్‌ తిప్పారెడ్డి, పట్టణ ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవే త్తలు పాల్గొన్నారు. మదనపనల్లె వైసీపీ నియోజ కవర్గ ఇన్‌చార్జి నిస్సార్‌ అహ్మద్‌, జనసేన రాయలసీమ కో-కన్వీనర్‌ రాందాస్‌ చౌదరి, మదనప ల్లె వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు జంగాల శివరాం, మల్లయ్య కొండ మాజీ చైర్మన్‌ మద్దిరెడ్డి, కురవంక సర్పంచ్‌ పసుపులేటి చలపతి స్వామి వారిని దర్శించుకు న్నారు. ఆల యంలో భక్తులకు అన్నదానం చేశారు. కమిటీ సభ్యులు కార్య క్రమాలను పర్య వేక్షించారు.

గుర్రంకొండలో....

గుర్రంకొండ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణాష్టమి వేడుకల ను మండల ప్రజలు ఘనంగా చేసుకున్నారు. ఇందిరమ్మకాల నీలో కొలువైన స్వామి వారి ఆలయంలో ఉదయాన్నే అర్చన, అభిషేకాలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవారిని ప్రత్యే కంగా అలంకరించి పూజలు నిర్వహిం చారు. అధిక సంఖ్య లో భక్తులు స్వామి వారిని దర్శించు కుని తీర్థప్రసాదాల ను స్వీకరించారు. సాయంకాలం ఆల యంలో గీతాపారా యణం, భజనలను నిర్వహించారు. అన్ని గ్రామాల్లో కృష్ణాష్ట మి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో చేసుకున్నారు.


16PLR02.gifపీలేరులో రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు

పీలేరులో....

పీలేరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను వేడుకగా నిర్వ హించారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి కళ్యాణోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరే గించారు. పీలేరు సహా పరిసర ప్రాంత యాదవ కుటుంబీకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో....

పెద్దమండ్యం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మండలం లో కృష్ణాష్టమి పూజలను భక్తిశ్రద్దలతో నిర్వహించా రు. ఉట్టి కొట్టే వేడుకలు జరిగాయి. చిన్నారి పిల్లలను శ్రీకృష్ణుడి వేషధారణలు ఆకట్టుకున్నాయి.

కురబలకోటలో...

కురబలకోట, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మండలం లో ని తెట్టులో వెలిసిన సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో శనివారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వ హించారు. స్వామి వారిని ప్రత్యేకంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కృష్ణ, గోపికల వేషధారణలతో సాంస్కృతిక కార్యక్ర మాలు ఆకట్టుకున్నాయి. రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్‌, సర్పంచ్‌ మనోహర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ కామ కోటి ప్రసాదరావు పాల్గొన్నారు.


తంబళ్లపల్లెలో....

తంబళ్లపల్లె, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మండల ప్రజ లు కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా చేసుకున్నారు. శ్రీ కృష్ణుడి ఆలయాల్లో ప్రత్యేక పూజ లు చేశారు. పలువురి ఇళ్లలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ భగవానుడి చిత్ర పటం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. తల్లితండ్రులు తమ చిన్నారులకు శ్రీ కృష్ణుడు, గోపి క వేషధారణలతో ముస్తా బు చేసి మురిసిపో యారు. మహిళలు సాయంత్రం ఇళ్ల ముంగిట సుద్దము క్కలతో చిన్నిచిన్ని పాదాలు వేసి చిన్ని కృష్ణుడుని ఇళ్లలోకి ఆహ్వానించారు.

Updated Date - Aug 16 , 2025 | 11:18 PM