Home » Jubilee Hills Bypoll
కాంగ్రెస్‌పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీఆర్కే భవన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు అంశాలని ప్రస్తావించారు కేటీఆర్.
స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్ర శేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్‌తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా... తొలిరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌కి సోయి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ తరఫున శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
ఉప ఎన్నికలో ప్రలోభాలను కట్టడి చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని, అనుమానిత లావాదేవీలపై నిఘా పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థులు పెట్టే ఖర్చులకు సంబంధించిన ధరల పట్టికను ఎన్నికల అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం అభ్యర్థులు రోజువారీగా ఖర్చులను చూపించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించరా అని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని అంజన్‌కుమార్ యాదవ్ నిలదీశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నిర్వహణ ప్రక్రియపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. ఇప్పటికే అధికారులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తికాగా, గురువారం చాదర్‌ఘట్‌లోని విక్టోరియా ప్టేగ్రౌండ్ భవనంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర అధికారుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ జరిగింది.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.9 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు రోడ్ నంబర్ 5లోని మెట్రోస్టేషన్ వద్ద ఎస్‌ఐ జగదీష్ ఆధ్వర్యంలో గురువారం వాహన తనిఖీలు చేపట్టారు.
నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు.