Jubilee Hills by-election: డ్రోన్ కెమెరాకు రూ.5 వేలు...
ABN , Publish Date - Oct 11 , 2025 | 07:26 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థులు పెట్టే ఖర్చులకు సంబంధించిన ధరల పట్టికను ఎన్నికల అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం అభ్యర్థులు రోజువారీగా ఖర్చులను చూపించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.
- మినీ ఫంక్షన్ హాల్‌కు రూ.6,200
- సింగిల్ టీ రూ.5, చికెన్ బిర్యానీకి రూ.170
- రేట్‌చార్ట్‌ను విడుదల చేసిన ఎన్నికల అధికారులు
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) నేపథ్యంలో అభ్యర్థులు పెట్టే ఖర్చులకు సంబంధించిన ధరల పట్టికను ఎన్నికల అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం అభ్యర్థులు రోజువారీగా ఖర్చులను చూపించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. రేట్‌చార్ట్‌లో ప్రచారానికి ఉపయోగించే సౌండ్‌బాక్స్ లు మొదలుకుని బ్యానర్లు, వాల్‌పోస్టర్లు, కుర్చీల వరకు అన్నింటికీ ధరలు నిర్ణయించారు.
ఇందులో డ్రోన్ కెమెరాకు 12 గంటలకు రూ.5వేలు, మినీ ఫంక్షన్‌హాల్ రోజుకు రూ.6,200, సింగిల్ టీ రూ.5, పెద్ద కప్పునకు రూ.10, కాఫీ సింగిల్‌కి రూ.6, పెద్ద కప్పునకు రూ.11 ధర పెట్టారు. ఒక వాటర్ ప్యాకెట్‌కు రెండు రూపాయలు, 200 మిల్లీ లీటర్ల వాటర్ బాటిల్‌కు రూ.6 ఉండగా, 500 మిల్లీలీటర్ల బాటిల్‌కు రూ.10, లీటర్ వాటర్ బాటిల్‌కు రూ. 20 ఉంచారు. 300 గ్రాముల పులిహోరకు రూ.40, ఒక ఆలు సమోసాకు రూ.10, వెజ్ బిర్యానీ 750 గ్రాములకు రూ.115, చికెన్ బిర్యానీ 750 గ్రాములకు రూ.170,

ఎగ్ బిర్యానీ 750 గ్రాములకు రూ.135, మటన్ బిర్యానీ 750 గ్రాములకు రూ.180, వెజ్ ఫ్రైడ్ రైస్ 750 గ్రాములకు రూ.90, ప్లేట్ ఇడ్లీ (నాలుగు)రూ.20, వడ ప్లేట్ (రెండు) రూ.20, వెజ్ మీల్స్ (సింగిల్)కు రూ.80 రేటు ఉన్నట్లు చెప్పారు. అలాగే సమావేశాలను ఏర్పాటు చేసుకునేందుకు తీసుకునే పెద్ద ఫంక్షన్ హాల్‌కు రూ.62,000, ఏసీ ఫంక్షన్‌హాల్‌కు రూ.1,25,000 ఉన్నట్లు ప్రకటించారు. వీటితోపాటు సౌండ్‌బాక్స్‌లు, కుర్చీలు, పేపర్ పేట్లు, టీషర్లు, వీడియోలు, డ్రోన్ కెమెరాల ఫొటోలకు ఒక్కో రేటు పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News