Jubilee Hills by-election: అనుమానిత లావాదేవీలపై నిఘా పెట్టాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 08:03 AM
ఉప ఎన్నికలో ప్రలోభాలను కట్టడి చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని, అనుమానిత లావాదేవీలపై నిఘా పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ సిటీ: ఉప ఎన్నికలో ప్రలోభాలను కట్టడి చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని, అనుమానిత లావాదేవీలపై నిఘా పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(District Election Officer and GHMC Commissioner RV Karnan) అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం జిల్లా ఇంటెలిజెన్స్, ఎక్స్సెండిచర్ మానిటరింగ్ కమిటీ (డీఐఈఎంసీ) సమావేశాన్ని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ మాట్లాడుతూ 24 గంటల పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్, వీడియో సర్వైలెన్స్ బృందాలు యాక్టివ్‌గా ఉండాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ నియంత్రణ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీసీపీ అపూర్వారావు, ఈఈఎం నోడల్ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంసీసీ నోడల్ అధికారి నర్సింహారెడ్డి, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ రాజ్‌కుమార్, పంచాక్షరి, క్రిష్ణ చైతన్య, అశీష్ చక్రవర్తి, ప్రదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News